స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు

  • స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులకు ఫిర్యాదు
  • పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ
  • విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ
  • మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదన్న చిరంజీవి యువత
స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అనుదీప్ కటికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మెగా అభిమాన సంఘాల నేతలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అఖిల భారత చిరంజీవి యువత, తెలంగాణ చిరంజీవి యువత ప్రతినిధులు నేడు వీసీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షుడు వెల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో పలువురు సజ్జనార్‌ తో సమావేశమై ఫిర్యాదు అందజేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్, ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనుదీప్‌తో పాటు మరికొందరు స్టాండప్ కమెడియన్లు కూడా మెగా ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చిరంజీవి యువత నాయకులు తెలిపారు. ఇకపై మెగా ఫ్యామిలీపై ఎవరైనా వ్యక్తిగత దాడులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. కామెడీకి, వ్యక్తిగత దూషణలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని వారు స్పష్టం చేశారు.

కాగా, స్టాండప్ కమెడియన్ అనుదీప్ ను ఏపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే. కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లిన అతడిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇటీవల అతడు పవన్, నిహారికల వ్యక్తిగత జీవితాలు, విడాకులపై వ్యంగ్యంగా స్కిట్ చేశాడు. దాంతో అతడిపై మెగా అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు. 

Anudeep Katikela
Pawan Kalyan
Ram Charan
Niharika Konidela
Chiranjeevi Youth
Hyderabad Police
Standup Comedy
AP Police
Mega Family
VJ Sajjanar

More Telugu News